NTV Telugu Site icon

Sanghamitra Express: రిజర్వేషన్‌ బోగీలోకి చొరబడిన యువకులు.. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో యాత్రికులకు చుక్కలు..

Sanghamitra

Sanghamitra

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు చుక్కులు చూపించారు కొందరు యువకులు.. రిజర్వేషన్‌ బోగీలోకి పెద్ద ఎత్తున యువకులు చొరబడ్డారు.. దీంతో, సంఘమిత్ర ఎక్స్ ప్రెస్‌లో గత రాత్రి నరకం అనుభవించారు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యాత్రికులు.. రిజర్వేషన్‌ బోగీలోకి పెద్ద ఎత్తున యువకులు రావడంతో.. నానా ఇబ్బందులు పడ్డారు దాదాపు 130కు పైగా యాత్రికులు.. అయితే, తూర్పుగోదావరి నుంచి కాశీ యాత్రకు వెళ్లారు భక్తులు.. కాశీ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.. కాశీ నుంచి తిరుగు ప్రయాణంలో సంఘమిత్ర రైలులో ఎక్కారు.. ముందుగా రిజర్వేషన్‌ చేసుకుని.. ఆ ప్రకారమే బోగీల్లోకి ఎక్కారు.. కానీ, ట్రైన్‌లోని రిజర్వేషన్‌ కంపార్ట్‌మెంట్‌లోకి పెద్ద ఎత్తున చొరబడ్డారు యువకులు.. కాలు కదిపే ఆస్కారం కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు.. కనీసం బాత్‌రూమ్‌కి వెళ్లాలన్నా నానా తిప్పలు పడాల్సి వచ్చిందని మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.. రిజర్వేషన్‌ బోగీల్లోకి ఎందుకు ఎక్కారని నిలదీస్తే.. కొందరు యువకులు తమని బెదిరించారని తూ.గో జిల్లా వాసులు చెబుతున్నారు.. ఇక, రిజర్వేషన్ బోగిలో జొరబడ్డ యువకుల్లో కొందరు మద్యం మత్తులో ఉండడంతో బిక్కు బిక్కు మంటూ గడిపామని అంటున్నారు.

Read Also: Astrology : డిసెంబర్‌ 20, మంగళవారం దినఫలాలు