NTV Telugu Site icon

Earthquake: నెల్లూరులో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం

Earthquake

Earthquake

తెలుగు రాష్ట్రాల్లోనూ తరచూ భూప్రకంపనలు భయపెడుతూనే ఉన్నాయి.. అయితే, అవి తీవ్రస్థాయి భూకంపాలు మాత్రం కావు.. తాజాగా, నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.. ఇవాళ ఉదయం జిల్లాలోని నాలుగు మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.. దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాలతో పాటు మర్రిపాడు మండలంలో భూ ప్రకంపనలు వచ్చాయి.. పలు గ్రామాలలో మూడు సెకన్ల నుంచి ఐదు సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.. భూ ప్రకంపనల కారణంలో ఇళ్లలోని వస్తువులు కదలడంతో భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్లను వదిలి బయటకి పరుగులు తీశారు.. ఆ తర్వాత మళ్లీ ఇళ్లకు చేరుకున్నారు. అయితే, భూ ప్రకంపనల కారణంగాతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేదని అధికారుల స్పష్టం చేశారు. కానీ, భూప్రకంపనలు.. నాలుగు మండలాల్లో కలకలం సృష్టించాయి..కాగా, గతంలోనూ పలుసార్లు నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే.

Read Also:Srilanka Crisis: రాజపక్స పారిపోయేందుకు భారత్ సహకారం.. స్పందించిన విదేశాంగ శాఖ