NTV Telugu Site icon

Earthquake in Kurnool: కర్నూలులో భూప్రకంపనలు.. ఇళ్లు, సీసీ రోడ్డుకు బీటలు..

Earthquake

Earthquake

Earthquake in Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూ కంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి.. టర్కీలో భూకంపం తర్వాత భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో భూప్రకంపనల కలకలం రేపుతున్నాయి.. తుగ్గలి మండలం రాతనలో భూప్రకంపనలు వచ్చాయంటున్నారు స్థానికులు.. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఉలిక్కిపడిన ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే, భూకంపం థాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటలు వారినట్టు చెబుతున్నారు.. రాతనలోని దాదాపు 15 ఇళ్లకు బీటలు వారగా.. గ్రామంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్డుకు కూడా బీటలు వారినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఆ గ్రామాన్ని పరిశీలించారు.. అయితే, భూప్రకంపనల తీవ్రత ఏస్థాయిలో నమోదు అయ్యింది.. రిక్టర్‌ స్కేల్‌పై ఎంత మేర నమోదు అయ్యింది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Read Also: Family Doctor: మార్చి 15 నుంచి పూర్తిస్థాయిలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’