Site icon NTV Telugu

Tirupati Rain: తిరుపతిలో భారీ వర్షం.. శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు

Tml

Tml

Tirupati Rain: తిరుపతిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకి సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వర్షం కారణంగా మంచు దుప్పట్లో నగరం ఉండడంతో వాటిని తమ కెమెరాలు బంధిస్తున్నారు శ్రీవారి భక్తులు, నగరవాసులు. ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్నటు వంటి వర్షానికి శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, వర్షం వల్ల ఏర్పడిన అందాలను ఆ గోవిందుడి నామాలను చూస్తూ ఆనందంతో పరవశించి పోతున్నారు.

Read Also: Father Kills Man: బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడు.. తండ్రి ఏం చేశాడంటే..

మరోవైపు, తిరుమలలో ఎల్లుండి ఆన్లైన్లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే, రేపు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను సైతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version