Dussehra 2025: దసరా పండగను విజయదశమి అని కూడా పిలుస్తుంటారు. ఈ పండగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం 10వ రోజున దసరా పండుగ వస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. దసరా పండగను దేశంలో ఒకొక్క ప్రాంతంలో ఒక్కొ విధంగా జరుపుతారు. అయితే, దసరా పండుగ నాడు ముఖ్యంగా శ్రీ మహా లక్ష్మీదేవి పూజ ముఖ్యమైంది. ఆర్థిక సమృద్ధి, సంపద, సుఖశాంతి కోసం ఈ పూజ చేస్తే లక్ష్మీదేవీ అనుగ్రహం లభిస్తుందని హిందువులు నమ్ముతారు. అలాగే, ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే, వాటి నుంచి బయట పడేందుకు దసరా చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.
Read Also: చేతకాకపోతే రాజీనామా చేసేయండి.. Mohsin Naqviని కడిగేసిన పాక్ మాజీ ప్లేయర్
లక్ష్మీదేవి పూజా విధానం..
ఇక, దసరా పండుగా నాడు లక్ష్మీ దేవీని పూజించే సమయంలో ఇంటిని పరిశుభ్రంగా చేసి, నూతన వస్ర్తాలు ధరించి, పువ్వులు, పల్లకీలు, అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. అలాగే, అమ్మవారికి సంధ్యాకాలంలో దీపం, ధూపం, అర్చన, పుష్పాలు ఉపయోగించి ఆరాధన చేయాలి అని పండితులు చెబుతున్నారు. ఈ పూజా సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి పూజించటం వల్ల ఆర్థిక, ఆత్మిక, కుటుంబ సమృద్ధి పొందుతారని వేదాలలో లిఖించబడింది. పూజా సమయంలో లక్ష్మీ స్తోత్రం, సుందరి కీర్తనలు పఠించడం శ్రేయస్కరం.
శని దోష నివారణ చర్యలు..
అయితే, పండగ రోజున ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఇక, దసరా నాడు శని దోష నివారణ పరిహారాలు జాతకంలో శని దోషం ఉన్నవాళ్లు.. విజయదశమి రోజున జమ్మి చెట్టుని పూజించాలి అని జోతిష్యులు చెబుతున్నారు. అంతే కాదు దసరా నాడు ఇంటికి ఈశాన్య దిశలో జమ్మి చెట్టుని నాటాలి అని సూచిస్తున్నారు. ఇది జాతకంలోని శని దోషాన్ని పూర్తిగా తొలగిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే, శనీశ్వరుడు, హనుమంతుని ఆరాధన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమాన్ భక్తులు ప్రతి రోజూ హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించాలి అన్నారు. ఇలా చేయడం వల్ల శని దోషాలు ఉన్నవాళ్లను హనుమంతుడు రక్షిస్తాడు అని భక్తులు నమ్ముతారు. ఎవరైనా జాతకంలో శని దోషంతో ఇబ్బంది పడుతుంటే.. దాని నుంచి రిలీఫ్ పొందడానికి దసరా పండగా రోజున శనీశ్వరుడిని, హనుమంతుడిని పూజించడం మంచిదంటా.
