దసరా మహోత్సవాలకు సిద్ధమవుతోంది ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం… దసరా మహోత్సవాల నిర్వహణపై ఇవాళ శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయ అధికారులు.. అక్టోబర్ 7 నుండి 15 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్టు సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత వెల్లడించారు శ్రీశైలం ఆలయం ఈవో లవన్న.. ఈ సమయంలో వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమివనున్నారు శ్రీశైల భ్రమరాంబికా దేవి.. కోవిడ్ నిబంధనలతో శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేసినట్టు లవన్న వెల్లడించారు.. గ్రామోత్సవం రద్దు దృష్ట్యా స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణ ఉంటుందన్నారు.. ఇక, దసరా మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున.. స్వామి అమ్మవారికి అక్టోబర్ 14న పట్టువస్త్రాలు సమర్పణ ఉంటుందని తెలిపారు ఈవో ఎస్.లవన్న.
7 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
