NTV Telugu Site icon

Karnati Rambabu: కొత్త జంటలకు అమ్మవారి అద్భుత దర్శనం

Durga Gudi

Durga Gudi

దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు సమావేశం నిర్ణయాలు తెలిపారు. నూతన వదువురులను పార్వతి పమేశ్వరులలా భావించి కొంగు ముడితో వచ్చే జంటను అంతరాలయంలో దర్శనం చేయించి ,ఆశీర్వచనం ఇవ్వబోతున్నాం. ఉత్సవ మూర్తలకు బంగారు మకరతోరణం పెట్టబోతున్నాం అని తెలిపారు. హారతికి వచ్చే భక్తులకు ఉచితంగా లడ్డూప్రసాదాన్ని ఇవ్వాలని నిర్ణయించాం.సెక్యురిటి నిమిత్తం మెటల్ డిటెక్టర్ తో స్కాన్ చేసి వచ్చేలా ఏర్పాటు చేస్తాం. ఘాట్ రోడ్ లోగాని ఇతర ప్రాంతాల్లో టాయిలెట్స్ ను వెస్ట్రన్ పద్దతిలో ఏర్పాటు చేయబోతున్నాం..దుర్గాఘాట్ లో దుస్తులు రూమ్, క్లాస్ రూమ్ ల కోసం టెండర్స్ పిలిచాం..కేశఖండనశాలలో పర్యవేక్షణ ఉండేలా ఏఈవో స్దాయి అధికారిని ఇన్చార్హ్ గా ఉంచి , పాలకమండలి నుండి ఒకరు , సూపరిండెంట్ స్దాయిలో ఒకరు , సీసీ కెమేరాల పర్యవేక్షుడ్ని తో త్రిమెన్ కమిటీ వేయబోతున్నాం అన్నారు.

Read Also: Dharmana Prasada Rao: అలాంటి వారిని నమ్మవద్దు.. ఓటు వేయవద్దు

టీటీడి తరహాలో లడ్డూ ప్రసాదాన్ని క్వాంటిటి ,క్వాలిటి పెంచేలా భక్తులపై భారం పడకుండా ఉండేలా ఇవ్వబోతున్నాం..లిఫ్ట్ దగ్గర , కేశఖండన శాల , ఈవో చాంబర్ దగ్గర భక్తులకు సలహాలు ,సూచనలకోసం సజేషన్ బాక్సులను ఏర్పాటు చేయబోతున్నాం.. నెలకొకసారి ఈవో ,నేను వాటిని పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటాం. దుర్గగుడిలో ఉన్న 500 ఉద్యోగులు భక్తుల పట్ల అమర్యాద ప్రవర్తింకుండా ఉండేలా అవగాహన సదస్సు పెట్టబోతున్నాం..ఉద్యోగులు డ్రెస్ కోడ్ ఉండాలని నిర్ణయించాం.. వారికి డ్రెస్ లు దేవస్దాన‌ నుండే ఇవ్వాలని నిర్ణయించాం. రెంట్ లక్షరుపాయలు కడతామని ఫ్యాన్సి షాప్స్ నిర్వాహకులు తీసుకున్నారు. వాళ్లు పాత బకాయిలు చెల్లించేస్తే వారి ఇబ్బందులపై దృష్టిపెడతాం అన్నారు పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు.

Read Also: Dharmana Prasada Rao: అలాంటి వారిని నమ్మవద్దు.. ఓటు వేయవద్దు