Site icon NTV Telugu

Draupadi Murmu: ఏపీలో ద్రౌపది ముర్ము బిజీబిజీ

Draupadi Murmu

Draupadi Murmu

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీలో బిజీబిజీగా గడుపుతున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం లభించింది. ఆమెతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు బీజేపీ నాయకులు సోము వీర్రాజు, సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్, జీవీయల్ నర్సింహారావు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మార్గాని భారత్, మిథున్ రెడ్డి, మంత్రి జోగి రమేష్.

సీఎం నివాసానికి చేరుకోనున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జగన్ తో భేటీ అవుతారు. ద్రౌపది ముర్ముకు తేనీటి విందు ఇవ్వనున్నారు సీఎం జగన్. ద్రౌపది ముర్మును వెంట పెట్టుకుని సీకే కన్వేన్షన్ సెంటరుకు చేరుకున్నారు సీఎం జగన్. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ద్రౌపది ముర్ముకు పరిచయం చేయనున్నారు సీఎం జగన్. తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరనున్నారు ద్రౌపది ముర్ము. మరోవైపు సీకే కన్వెన్షనుకు చేరుకుంటున్నారు ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.

విజయవాడకు చేరుకున్నారు చంద్రబాబు. తన నివాసంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. సాయంత్రం రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మును కలవనున్నారు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతు తెలిపారు చంద్రబాబునాయుడు.

Vishal: విశాల్ కు గాయాలతో ‘లాఠీ’ వెనక్కి!

Exit mobile version