తిరుపతిలోని ముదివేడు పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐపై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది.. రూ.10 లక్షల అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురానికి రావాలని భార్యను వేధించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండల ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న సుకుమార్… భార్యను గన్‌తో కాల్చ తానని బెదిరించడం వంటి అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఎస్ఐ సుకుమార్ భార్య విష్ణు ప్రియ ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్టు మదనపల్లె రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్, ఇంచార్జ్ సీఐ మురళీ కృష్ణ వెల్లడించారు.. 155/2022 అండర్ సెక్షన్ 498a, 3 23, 506, r/w 34, 3 మరియు 4 ఆఫ్ డీపీ యాక్ట్ కింద ఎస్ఐ సుకుమార్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు దేవరాజులు, కృపారాణి, శాంతమ్మ, సైమన్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు అధికారులు.
Read Also: Konaseema: అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్..