NTV Telugu Site icon

V.C. Sajjanar: ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు డిసౌంట్‌ ఆఫర్‌..

Vc Sajjanar

Vc Sajjanar

V.C. Sajjanar: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో కమ్యూనికేషన్, రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. తాజాగా ఆర్టీసీ ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులు కొట్టుకుపోయి.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Read also: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు..

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరపై 10% రాయితీ ఇస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇది అన్ని AC, సూపర్ లగ్జరీ మరియు రాజధాని బస్సులలో వర్తిస్తుంది. ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ https://www.tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు ప్రయాణికులకు తెలిపారు. ప్రకృతి విధ్వంసం, వరుణుడి ఉగ్రరూపంతో విజయవాడ దద్దరిల్లింది. బుడమేరు నది పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కొంతమంది బయటకు రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయదేవి నగర్, పైపెల్ రోడ్డు, ప్రకాష్ నగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ఇరు రాష్ట్రాల ప్రజలకు ఊరటనిస్తుందని అంటున్నారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?