Site icon NTV Telugu

టిక్కెట్ రేట్లు, షోస్ పై స్పందించిన దర్శకేంద్రుడు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ప్రదర్శన, టిక్కెట్ రేట్ల పై నియంత్రణ పెట్టడాన్ని ఖండించారు. నాలుగున్నర దశాబ్దాలుగా దర్శకుడిగా, నిర్మాతగా ఈ రంగంలో ఉన్న వ్యక్తిగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యం, పంపిణీదారులు, నిర్మాతలు వీరంతా బాగుంటేనే చిత్రసీమ బాగుంటుందని అన్నారు. టిక్కెట్ రేట్లు తగ్గించడం, షోస్ ను ప్రభుత్వం నిర్ణయించడం వల్ల చాలామంది తీవ్ర నష్టాలకు గురి అవుతారని రాఘవేంద్రరావు అభిప్రాయ పడ్డారు. కామన్ మ్యాన్ కు సినిమా ఒక్కటే వినోద సాధనమని అన్నారు. ఒక హిట్ సినిమా ఎక్కువ షోస్ ప్రదర్శించడం, మొదటివారం రేట్లు పెంచడంతో ఆ తర్వాత వచ్చే చిన్న సినిమాలను ఆడించడానికి ఎగ్జిబిటర్స్ కు ఆస్కారం ఉంటుందని, సినిమా రంగంలో పది శాతం హిట్ చిత్రాలు, పదిశాతం ఏవరేజ్ చిత్రాలు మాత్రమే వస్తుంటాయని అన్నారు. టిక్కెట్లను మొత్తంగా ఆన్ లైన్ లో అమ్మడం ద్వారా దోపిడీ ఆగిపోతుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదని, కొందరు ఇన్ ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు టిక్కెట్లను బ్లాక్ చేసుకుని, ఆ తర్వాత అధిక ధరలకు అమ్మే ఆస్కారం ఉంటుందని, అదే ప్రభుత్వమే ఎక్కువ రేట్లకు టిక్కెట్ అమ్మితే, టాక్స్ ద్వారా ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుందని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.

Exit mobile version