NTV Telugu Site icon

గుంటూరు కోవెలమూడి వైసీపీలో డిష్యుం…డిష్యుం

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి పంచాయతీ సమావేశంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశం వద్దకు వచ్చిన ఒక వర్గానికి చెందిన సర్పంచి భర్త ఆళ్ల శ్రీను. రెండో వర్గానికి చెందిన దాసరి శ్రీశైలం సైతం సమావేశం వద్దకు వెళ్లడం వివాదానికి దారితీసింది.

సమావేశానికి బయట వ్యక్తులు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు వార్డు సభ్యులు. దీంతో చెలరేగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. పంచాయతీ బయటకు వచ్చాక రెండు వర్గాల మహిళా వార్దు సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 7వ వార్డు సభ్యురాలు సంధ్యారాణి , ఆమె భర్త పై మరో వార్డు మహిళా వార్దు సభ్యులు దాడికి పాల్పడ్డారు.

ఘర్షణ అనంతరం పోలీస్ స్టేషన్ కి చేరింది పంచాయతీ. సంధ్యారాణి , ఆమె భర్తను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.