Site icon NTV Telugu

Prakasam: శిలాఫలకం పెట్టిన చిచ్చు.. కొట్టేసుకున్న వైపీపీ వర్గాలు

Ycp Leaders Issue

Ycp Leaders Issue

ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శిలాఫలకంలో తమ నాయకుడి పేరు లేకపోవడంతో.. వైసీపీ వర్గాల మధ్య చిచ్చు రేగింది. పోలీసులు రంగంలోకి దిగేదాకా.. ఈ రగడ అదుపులోకి రాలేదు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏపీ ప్రభుత్వం ఈరోజు నుంచి రాష్ట్రంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగా గ్రామంలో స్కూల్ భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.

అయితే.. ఆ శిలాఫలకంలో స్కూల్ భవనానికి స్థలం ఇచ్చిన దాత బిజ్జం రమణారెడ్డి పేరు లేకపోవడంతో, బిజ్జం అనుచరులు కోపాద్రిక్తులయ్యారు. దీంతో వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలోనే మంత్రి ఆదిమూలపు సురేష్ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఫ్లెక్సీలను చించేశారు. పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితుల్ని అదుపు చేసిన తర్వాత.. మంత్రి సురేష్ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసుల పహారా మధ్య ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.

Exit mobile version