NTV Telugu Site icon

Dharmana Prasada Rao: అది మోసం కాదా.. అంటూ ప్రతిపక్షాలపై మంత్రి కౌంటర్

Dharmana

Dharmana

Dharmana Prasada Rao Counter To Opposition Leaders: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు అభివృద్దే జరగలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని.. కానీ ఎప్పుడూ జరగనంత అభివృద్ధి ఈ మూడున్నరేళ్ళలో ఈ పట్టణంలో జరిగిందని అన్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న అవినీతి సమస్య నుండి ఇప్పుడు ఒక దశ వరకు బయటపడ్డామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రతిపక్షం వారు దుబారా అంటున్నారని, అదే తాము అధికారంలోకి వస్తే మాత్రం ఆ పథకాలే ఇస్తామని చెప్తున్నారని, మరి అది మాయ – మోసం కాదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారన్నారు. తప్పు చేసి ఎవరినో నిందించడం సరికాదని హితవు పలికారు. లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి, ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. తప్పు చేయండని ఎవరూ చెప్పమని, కానీ ఈసారి తప్పు చేస్తే మాత్రం అది మీ ఇష్టమంటూ.. ప్రభుత్వాల్ని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా ప్రజల్ని సూచించారు. పెద గనగలవాని పేట బీచ్‌లో విశాఖ బీచ్ రోడ్‌లాగా పెద్ద రోడ్ వేయాలని తన కోరిక అని, అది తప్పకుండా చేస్తానని మాటిచ్చారు. పట్టణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తమ సాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. 80 ఫీట్ రోడ్ రావటం వల్ల మీ ఆస్తుల విలువ పెరిగాయని, ఇప్పుడు నాకన్నా మీరే ఆస్తి పరులు అయ్యారని ధర్మాన ఛలోక్తులు పేల్చారు.

Jr NTR: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. NTR30 సీక్రెట్స్ చెప్పేసిన తారక్

అంతకుముందు, విశాఖ వేదికగా ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో ధర్మాన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో సంస్కరణలపై చర్చించేందుకు, ప్రభుత్వ విధానాలను క్లియర్‌గా చెప్పేందుకు రీజినల్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అసైన్డ్ భూములపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, అసైన్డ్ భూములకు సంబంధించిన 77యాక్ట్‌కు సవరణలను ప్రతిపాదిస్తామని అన్నారు. 22(ఏ)భూములపై సర్వే త్వరితగతిన జరుగుతోందని, సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆటో మ్యూటేషన్ విధానం ద్వారా సింగిల్ విండో రిజిస్ట్రేషన్ పద్ధతి అమలు చేస్తామన్నారు. భూములపై సమగ్రమైన వివరాలు సేకరించిన తర్వాతే రిజిస్ట్రేషన్‌లు ఉంటాయన్నారు. భూమి విలువ పెరగడం ద్వారా సర్వతోముఖాభివృద్ధికి కారణంగా మారిందని, వివిధ కారణాలతో వివాదాస్పదంగా మిగిలిపోయిన భూములను వినియోగంలోకి తీసుకుని రావాలనేది సీఎం ఆలోచనగా ఉందని వెల్లడించారు.

Shanampudi Saidi Reddy : ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారు

Show comments