Deputy CM Pawan: చిత్తూరులోని ముసలి మడుగులో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఏనుగుల విన్యాసాలు వీక్షించారు. ఏనుగులు కృష్ణా, అభిమన్యులకు ఆహారాన్ని అందజేశారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టరును ఆవిష్కరించారు. హనుమాన్ అనే కార్యక్రమంలో 11 అంశాలను అటవీ శాఖ అధికారులు పొందుపరిచారు.
Read Also: CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ వస్తే.. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో బీజేపీ గెలిచినట్టే..
అయితే, హనుమాన్ అంటే హిలింగ్ అండ్ నర్చరీంగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైడ్ లైఫ్. నిర్దేశిత సమయంలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించాలని అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18, 19వ తేదీల్లో హనుమాన్ పై సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. అటవీ, పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవనం శాఖల అధికారులు సమావేశంలో పాల్గొనాలని తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
