Site icon NTV Telugu

Deputy CM Touch The Farmer Feets: కమ్మ సామాజిక వర్గంలో మార్పు..! నాయుడుకి డిప్యూటీ సీఎం పాదాభివందనం

Deputy Cm Narayana Swamy

Deputy Cm Narayana Swamy

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డీ సామాజిక వర్గం వర్సెస్‌ కమ్మ సామాజిక వర్గం మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి.. ఆ సామాజిక వర్గాలు ఎంత వరకు వీటిని పట్టించుకుంటారో తెలియదు.. కానీ, నేతల మాత్రం.. ఆరోపణలు, విమర్శలు చేసే సమయంలో.. మీ సామాజిక వర్గం.. ఆ సామాజిక వర్గం అనే పేర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అయితే, ఇవాళ చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ప్రభుత్వ పథకాలపై, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురించి మాట్లాడిన రాధా నాయుడు అనే వృద్ధుడికి పాదాభివందనం చేశారు.

Read Also: Elephant Attack: గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చిన కొత్త జంట.. ఆగ్రహంతో ఏం చేసిందంటే..?

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మొరవకండ్రిగలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రైతు కాళ్లు పట్టుకున్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఆ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ఓ వృద్ధ దంపతుల దగ్గరకు వెళ్లారు నారాయణస్వామి, వైసీపీ నేతలు.. ఓ నేత.. మీకు డ్వాక్రా రుణమాఫీ జరిగిందా? అని ప్రశ్నిస్తే ఆ వృద్ధురాలు జరిగిందని సమాధానం చెప్పారు.. ఇక, పెన్షన్‌ వస్తుందా? అని మరో ప్రశ్న వేశారు.. నీకా? పెద్దాయనకా? అని ఆ మహిళను ప్రశ్నించగా.. పెద్దాయనకు అని సమాధానం ఇచ్చారు.. అయితే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటూ మరో ప్రశ్న వేశారు.. దీనికి ఆ రైతు.. జగన్మోహన్‌రెడ్డి అని సమాధానం ఇవ్వడమే కాదు.. ఆయనే రావాలి ఈసారి మళ్లీ కూడా అంటూ బదులిచ్చారు.. దీంతో, ఆ రైతుకు దగ్గరగా వెళ్లిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. మీ పేరు ఏంటి? అని అడిగారు.. దాంతో.. రాధా నాయుడు అంటూ సమాధానం ఇచ్చాడు ఆ రైతు.. రాధానాయుడు గారు.. సీఎం జగనన్న పాలన బాగుందని చెప్పారు.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందని చెప్పారు.. దీంతో… ఓ డిప్యూటీ సీఎంగా ఆయనకు నేను పాదాభివందనం చేస్తున్నానంటూ.. ఆ రైతుకు పాదాభివందనం చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. సీఎం జగన్ పాలనలో కులాలు, పార్టీలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాధా నాయుడు అనే హర్షం వ్యక్తం చేశాడు. జగనన్నే మళ్లీ మళ్లీ సీఎం కావాలని కోరారు. కమ్మ సామాజిక వర్గంలో ఈ మార్పు రావడం బాగుందంటూ.. ఆయన కాళ్లను పట్టుకుని పాదాభివందనం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

Exit mobile version