NTV Telugu Site icon

Narayana Swamy: మళ్లీ మంత్రి కావాలనే ఆశ లేదు.. జగన్‌ నిర్ణయమే ఫైనల్..

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఇవాళ కేబినెట్‌ సమావేశం జరగబోతోంది.. ఒక రకంగా ఇదే చివరి కేబినెట్‌.. ఈ సమావేశం తర్వాత ముగ్గురు, నలుగురు మినహా మిగతావారంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. కేబినెట్‌ భేటీలోనే దీనిపై క్లారిటీ రాబోతోంది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… నేను మళ్లీ మంత్రి కావాలనే ఆశ లేదన్న ఆయన.. ఎల్లకాలం వైఎస్‌ జగన్ సీఎంగా ఉండాలనేదే నా కోరిక.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి జగన్ నన్ను ఎంతో గౌరవించారని.. జగన్ నా యజమాని.. నా నాయకుడు.. ఆయన నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.. నాకు ఎంతో గౌరవం ఇచ్చిన వైఎస్ ఫ్యామిలీకి నేనెప్పుడూ రుణపడే ఉంటాను అన్నారు.

Read Also: Live : మంత్రులందరితో రాజీనామా..?

ఇక, వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు తప్పించినప్పుడు నేనేం బాధపడలేదు అన్నారు నారాయణస్వామి… దళితుడ్ని కాబట్టే వాణిజ్య శాఖ బాధ్యతల నుంచి నన్ను తప్పించారని కొందరు మూర్ఖులు కామెంట్లు చేశారని మండిపడ్డ ఆయన.. నన్ను డిప్యూటీ సీఎంను చేసినప్పుడు.. రాష్ట్రపతి ఛాంబర్లోకి తీసుకెళ్లినప్పుడు సీఎం జగన్ దళితుణ్ని గౌరవించారని ఎందుకు అనలేకపోయారు అని ప్రశ్నించారు. నా శాఖపై ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేశాయని.. జంగారెడ్డి గూడెం ఘటన.. నాణ్యత లేని మద్యం సరఫరా అంటూ ప్రతిపక్షాలు విమర్శించినా ఒక్క మహిళైనా ఉద్యమించిందా..? అని నిలదీశారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారంటూ ప్రతిపక్షం అర్ధరహిత ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టిన ఆయన.. ప్రభుత్వ ఆదాయాన్ని చంద్రబాబు ఏనాడైనా పేదలకు పంచారా..? వారి సంక్షేమానికి వినియోగించారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.