ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మూడు రాజధానులపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఎంత నష్టపోయామో అందరికీ తెలుసు. తమ ప్రభుత్వం అమరావతిలోనే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానులు ఆలోచన చేస్తోందన్నారు.
ఈ మూడురాజధానులకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న దశలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. వెనుకబడిన రాయలసీమ, వెనక్కి నెట్టబడిన ఉత్తరాంధ్రలో కొన్ని దశాబ్దాల తర్వాత ఉద్యమాలు రాకూడదు. చంద్రబాబు చేసిన పని స్వార్థపూరిత, ఒక సామాజిక వర్గ ప్రయోజనం కోసం చేసింది.
కేవలం 26 గ్రామాల అభివృద్ధి మాత్రమే అక్కడ కనిపిస్తుంది తప్ప, రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి ఫలాలు చేరవు. మేమంతా వికేంద్రీకరణకు పూర్తి మద్దతు ఇస్తూ, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.త్వరలో మూడురాజధానుల బిల్లు తీసుకువస్తామన్నారు. అమరావతిపై హైకోర్ట్ తీర్పు నేసథ్యంలో మంత్రులు చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
