NTV Telugu Site icon

Graduate MLC election: ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. బరిలో ఎంతమంది ఉన్నారంటే?

Mlc

Mlc

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో మొత్తం 35 మంది అభ్యర్థులు నిలిచారు. 43 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ తుది గడువు ముగిసే నాటికి ఎనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 27వ తేదీన ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Also Read: Kangana Ranaut Cafe: ప్రేమికుల దినోత్సవం రోజున కంగనా సొంత రెస్టారెంట్ ఓపెనింగ్

గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవడంతో ఫైనల్ గా 25 మంది అభ్యర్థులు పోటీలో నిలవనున్నారు. కాగా మొత్తం 43 మంది ఈ గ్రాడ్యుయట్ ఎన్నికల్లో పాల్గొనేందుకు నామినేషన్లు దాఖలు చేయగా, వివిధ కారణాలతో 13 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో 30 మంది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు.

Also Read:JP Morgan Chase: లే ఆఫ్స్‌కి సిద్ధమైన JP మోర్గాన్ చేజ్..

అయితే నేటికీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి, ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఫైనల్ గా 25 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచినట్లయింది. మొత్తం మూడు లక్షల 45 వేలకు పైగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓట్లలో, 25 మంది అభ్యర్థులు ఎవరు ఎన్ని ఓట్లు దక్కించుకుంటారో, అంతిమ విజయం ఎవరికి దక్కుతుందోనన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.