సాధారణంగా అంత్యక్రియలను కూతుళ్లు నిర్వహించినా.. పాడె మోయడం, తలకొరివి పెట్టడం లాంటివి మాత్రం కూమారులే నిర్వహిస్తుంటారు.. అయితే, కుమారులు లేనివారి కూడా వారి దగ్గర బంధువులతో ఆ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు.. కొన్ని సందర్భాల్లో అయితే.. కూతుళ్లే అన్ని నిర్వహించిన సందర్భాలున్నాయి.. తాజాగా, ఓ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది.. కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో తండ్రి పాడె మోసి అంత్యక్రియలు నిర్వహించారు కూతుళ్లు..
Read Also: Daughter Killed Mother: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రేమ మాయలో పడి కన్నతల్లినే..
పల్లంకుర్రు శివారు చింతల చెరువు గ్రామానికి చెందిన సాపే అప్పారావు, మేరీరత్నం దంపతులకు మగమిల్లలు లేరు.. వారికి దైరుగురు కుమార్తెలు.. అయినా, వారిని మంచి చదువులు చదివించి, అందరికీ వివాహాలు జరిపించారు.. అయితే, అప్పారావు ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు.. కొన్ని ప్రాంతాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం శ్మశానవాటికలకు ఆడవారు వెళ్లరాదు.. మరికొన్ని ప్రాంతాల్లో అక్కడి వరకు వెళ్లినా అంత్యక్రియలు నిర్వహించరాదు.. కానీ, అప్పారావు కుమార్తెలు.. అన్నీ తామే నిర్వహించారు.. పెద్ద కుమార్తె స్వర్ణలత తలకొరివి పెట్టారు.. ఇక, దాదాపు 4 కిలోమీటర్ల మేర సాగిన అంతిమయాత్రలో.. అప్పారావు పాడెను కొద్దిసేపు మోశారు ఆయన కూతుళ్లు.. అన్ని తామేయై అమ్మాయిలు అంత్యక్రియలు నిర్వహిస్తుంటే.. బంధువులు, గ్రామస్తులు.. ఆ ఘటన చూసి చలించిపోయారు..