NTV Telugu Site icon

దూసుకొస్తున్న యాస్ తుఫాన్.. తీవ్ర ప్ర‌భావం-ఐఎండీ

Cyclone

తౌక్టే తుఫాన్ సృష్టించిన‌ బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మ‌రో తుఫాన్ దూసుకొస్తుంది.. ఈనెల 23వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది.. ఈ అల్పపీడనం 72 గంటల్లో బలమైన తుఫానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.. యాస్ తుఫానుగా పిలుస్తున్న ఈ తుఫాన్.. ఈనెల 26 నుంచి 27 మధ్య వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా-ప‌శ్చిమ‌బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు.. దీంతో.. మ‌త్స‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం.. ఇక‌, యాస్ తుఫాన్ హెచ్చ‌రిక‌ల‌తో నావికాద‌ళం అప్ర‌మ‌త్తం అయ్యింది… రెస్క్యూ, రిలీఫ్ ఆప‌రేష‌న్ల కోసం యుద్ధ‌నౌక‌లు, హెలికాప్ట‌ర్లు సిద్ధం చేశారు.. ఒడిశా, బెంగాల్‌తో పాటు ఏపీ తీర‌ప్రాంతంపై భారీ ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.. ఉత్త‌ర అండ‌మాన్ ప్రాంతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డ‌గా.. తుఫాన్‌గా మారి తీరం దాటే ప్రాంతాల్లో అప్ర‌మ‌త్తం అయ్యింది నావికాద‌ళం. ఇక‌, ఈ తుఫాన్ ప్ర‌భావం తీవ్రంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తోంది ఐఎండీ.