Wipha Cyclone: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన తర్వాత.. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో.. ప్రస్తుతం ఇది తుఫానుగా రూపాంతరం చెందింది. ఈ అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల ఒకటి రెండు భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని ఐఎండీ పేర్కొనింది.
Read Also: Karnataka: భర్తను నదిలో తోసిన భార్య కేసులో ట్విస్ట్.. భర్తపై పోక్సో కేసు నమోదు
ఇక, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, తీర ప్రాంతాల దగ్గర గంటకు 60 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో గాలులు వీసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. అయితే, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గత 24 గంటల్లో గుంటూరు జిల్లా మాచర్ల, నర్సీపట్నం ప్రాంతాల్లో సుమారు 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది అన్నారు.
