ఏపీని తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. మొన్న ‘మొంథా’ తుఫాన్ మిగిల్చిన నష్టాలకు పరిహారం కూడా అందక మునుపే.. ‘దిత్వా’ తుఫాన్ దూసుకొచ్చింది. వాయుగుండం నుంచి అల్ప పీడనంగా బలహీనపడినప్పటికీ.. పలు జిల్లాలపై మాత్రం పెను ప్రభావం చూపింది. నవంబర్ 30న తుఫాన్ ప్రభావం మొదలైనప్పటికీ.. మొదటి మూడు రోజులు మోస్తరు వానలే పడ్డాయి. మంగళవారం (డిసెంబర్ 2) నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దిత్వా దెబ్బకు నెల్లూరు జిల్లా వణికిపోయింది.
Also Read: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆటంకాలు తప్పవు!
గత 24 గంటల్లో వెంకటాచలంలో 219.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మనుబోలులో 158.8 మిల్లీమీటర్లు, ముత్తుకూరులో 140.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కోట, వాకాడు చిల్లకూరులోనూ భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు పెన్నా, కండలేరు, కైవల్య, కాళంగి, సరేనాముఖి, బొగ్గేరు, బీరాపేరు, కొమ్మలేరు, నక్కలవాగు, పందుల వాగులు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాలు మొత్తం జల దిగ్బంధంలో మునిగిపోయాయి. వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. కూరగాయలు, పండ్ల పంటలు సైతం దెబ్బతిన్నాయి.
