Cyclone Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య దిశగా పయనించి రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్. ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిస్సా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. ఇక, దీని ప్రభావంతో నేడు ( అక్టోబర్ 1న) విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు యానాంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Read Also: Jhansi: రైల్వే గేట్ వేశారని.. బైక్ ని భుజాలపై మోసుకెళ్లిన బహుబలి..
అయితే, అల్లూరి సీతారామ రాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడే ఛాన్స్ ఉంది. కాగా, నాలుగు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలోని అన్ని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉత్తర కోస్తాకు అతి భారీ వర్ష సూచన.. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడకుండా భక్తులను నియంత్రించాలి అన్నారు. భారీ వర్షాలు, వరద ధాటికి రైలు, రోడ్డు రవాణా మార్గాలు దెబ్బ తినే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
