మైచాంగ్ తుఫాను చెన్నై, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మైచాంగ్ తుఫానుకు రెండు రాష్ట్రాలు జలమయమైయ్యాయి. దీనితో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ వల్ల రైతులు వేల ఎకరాలు పంట నష్టపోయారని.. కాగా వర్షం వల్ల 20శాతం నష్టం జరిగితే.. 80 శాతం నష్టం డ్రైనేజి వ్యవస్థ కారణంగా జరిగిందని ఆరోపించారు. అలానే నీట మునిగిన పంటకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బియ్యం, ధాన్యం మార్కెట్ ధర పెరగకుండా నియంత్రించాలని.. అలానే ప్రమాణాలతో సంబంధం లేకుండా ప్రతి గింజను ప్రభుత్వాలు కొనాలని.. ప్రతి బస్తాకు 200 బోనస్ ఇచ్చి రైతుల వద్ద నుండి కొనాలని అయన కోరారు.
Read also:Bhatti Vikramarka: సీఎం రేసులో వున్న.. కానీ డిప్యూటీ సీఎంతో సరిపెట్టకున్న భట్టి..
అయితే ఇప్పటికే 75% పంటను కొన్నామని మంత్రులు అబద్ధం చెపుతున్నారు అని ఆయన ఆరోపించారు. కాగా పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే కేంద్ర నుండి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు 10వేల కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే రైతులకు రుణమాఫీ చేయాలని .. మళ్ళీ పంట వేసుకొనేందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని.. రాష్ట్రప్రభుత్వం వరికి ఎకరాకు 25వేలు, ఉద్యాన పంటలకు 50వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే ఆర్బిట్ కమిటీ వేసి కౌలు చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం చోరువ చూపాలని కోరారు.
