NTV Telugu Site icon

MP Gorantla Madhav Video Issue: ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండా.. ఆ వీడియో ఫేక్‌ అని ఎలా చెబుతారు..?

Bv Raghavulu

Bv Raghavulu

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో వ్యవహారంపై ఇంకా రచ్చ సాగుతూనే ఉంది.. ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు.. ఈ వ్యవహారం కేంద్రం వరకు వెళ్లింది.. ఓ ఎంపీ ప్రధాని దృష్టికి తీసుకెళ్తే.. జాతీయ మహిళా కమిషన్‌ … లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి.. ఆ సంగతి తేల్చమని కోరింది.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌ లేకుండానే.. ఆ విడియో ఫేక్‌ అని ఎలా చెబుతారు? అని నిలదీశారు.. ఎంపీ గోరంట్ల మాధవ్‌ రాస లీలల వ్యవహరంలో వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని విమర్శించిన ఆయన.. మహిళలను అవమాన పరిచేలా చర్యలు ఉన్నాయన్నారు.. ఇక, ఎస్పీ మీడియా సమావేశం దీనిని నిరుగార్చేలా ఉందన్న ఆయన.. ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఫోరెన్సిక్ లాబ్ కు రిపోర్ట్ లేకుండా, అది ఫేక్ అని ఎలా చెప్తున్నారు..? జరిగిందంతా ఏదో వ్యక్తులు మధ్య వ్యవహారంగా ఆ పార్టీ వ్యక్తులు మారుస్తున్నారని మండిపడ్డారు.

Read Also: Bandi Sanjay Letter to CM KCR: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ విధానలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీవీ రాఘవులు.. కేంద్రం భినత్వానికి తూట్లు పొడుస్తోందన్న ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తు గడ వేసిందన్నారు.. 24 వేల టన్నుల ఉత్పత్తికి 15 వేల టన్నులే ఉత్పత్తి జరుగుతోందన్నారు.. ఇక, దేశమంతా ఒకటే పన్ను, ఒకటే ఎన్నిక, ఒకటే మాట, అనే నియంతృత్వ ధోరణిలో కేంద్ర సర్కార్‌ వెళ్తోందని.. అది దేశానికి ప్రమాదమే అని హెచ్చరించారు. కేంద్రం.. రాష్ట్రాలకు డబ్బు ఇవ్వడం లేదు, రాష్ట్రం.. ప్రజలపై భారం మోముదుందని మండిపడ్డారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.