బోర్డర్లో అంబులెన్స్ లను నిలిపివేయడం వల్ల జరుగుతున్న మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. చెక్ పోస్టుల వద్ద పడిగాపులు కాచి ఈరోజు అంబులెన్స్ లో ఇద్దరు రోగులు చనిపోవడం బాధాకరం అని అన్నారు. తెలంగాణ హై కోర్ట్ చెప్పినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకుండా కనీసం మానవత్వం చూపించడం లేదు అని విమర్శించారు. అయితే తెలంగాణలో లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. బోర్డర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోర్డర్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను హైదరాబాద్ కు వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లాలోని పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి.