Site icon NTV Telugu

CPI Ramakrishna: ప్రజా ఉద్యమాలంటే జగన్‌కు అలుసా?

ఏపీలో విపక్షాలు మూకుమ్మడిగా అధికార వైసీపీపై మండిపడుతున్నాయి. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజా ఉద్యమాల అంటే సీఎం జగనుకు అంత ఉలుకెందుకు..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మోపాయి. ఈ నెల 9న సీపీఐ ఛలో అమరావతికి పిలుపునిస్తే రెండు రోజుల ముందు నుండే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారు.

అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం సీపీఐ, ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేయడం దుర్మార్గం. సీఎం జగనుకు చిత్తశుద్ధి ఉంటే పెంచిన ఆస్తి, చెత్త పన్నులను విరమించుకోవాలి. వంట నూనెల, నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై అధిక సుంకాల భారాన్ని తగ్గించాలి. అరెస్టు చేసిన సీపీఐ నేతలను తక్షణమే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Bandi Sanjay : కేసీఆర్ ప్లాన్ ప్రకారమే… రాహుల్ గాంధీ మీటింగ్

Exit mobile version