గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద బీటెక్ విద్యార్థిని రమ్యను అతి కిరాతకంగా హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలి అని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీటెక్ విద్యార్థిని రమ్య ను ఓ దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. అయితే స్వాతంత్ర దినోత్సవం రోజున ఇటువంటి దారుణం జరగటం బాధాకరం అని తెలిపారు. గతేడాది ఆగస్టు 17న కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామంలో హజీరా అనే యువతిని హత్య చేసిన దుర్మార్గుడిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. రమ్యని హత్య చేసిన దోషిని పోలీసులు తక్షణమే పట్టుకోవాలి అని తెలిపారు.
స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ ఘటన జరగడం బాధాకరం…
