Site icon NTV Telugu

మరో వెస్ట్ బెంగాల్ కాకుండా… కేసీఆర్ జాగ్రత్త పడాలి

మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈటల రాజేందర్ బయటకు వెళ్ళటం టిఆర్ఎస్ కే నష్టమని.. టిఆర్ఎస్ లో అసలైన తెలంగాణ వాదులు ఆరుగురే ఉన్నారని పేర్కొన్నారు. ఈటెల బిజెపిలోకి వెళ్తే కేసీఆర్ కే నష్టమని.. మరో పశ్చిమ బెంగాల్ లా… తెలంగాణ మారకుండా కేసీఆర్ జాగ్రత్త పడాలని సూచించారు. జార్ఖండ్ సీఎం.. కేంద్రాన్ని విమర్శిస్తూ లేఖ రాస్తే … సీఎం జగన్ ఎందుకు అడ్డు చెప్పారని..ఇప్పుడు ఎందుకు కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ బలం కూడగడుతున్నారని ప్రశ్నించారు. జగన్ కు బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని.. కేంద్రంపై వ్యతిరేకంగా లేఖ రాస్తే… బెయిల్ రద్దయినా సానుభూతి పొందొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే కోవిడ్ ను జగన్ కవచంలా వాడుకుం టున్నారన్నారు. ఈ నెల 8న లక్ష ద్వీప్ కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నామని.. కార్పొరేట్ శక్తులకు ఆ దీవులను కట్టబెట్టాలని బిజెపి ఆలోచిస్తోందని ఫైర్ అయ్యారు. వాళ్ళ ఆహారపు అలవాట్లు శాసించే హక్కు కేంద్రానికి ఎక్కడిది? ప్రఫుల్ పటేల్ లక్ష దీవుల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. లక్షదీవుల స్థానికులకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.

Exit mobile version