రాష్ర్టంలో పెట్రోల్, డీజీల్ రేట్లు పెరిగినా ప్రభుత్వం ఇప్పటికీ తగ్గించకుండా చోద్యం చూస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజ ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై అధికంగా భారం మోపుతూ అదానీలకు దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఇప్పటికే పోర్టులు,సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను అదానీకే సీఎం జగన్ అప్పగించారన్నారు.రాష్ట్రం మొత్తాన్ని వారికి దోచిపెట్టడానికే సీఎం జగన్ అధికారంలో ఉన్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అధికార పార్టీ ప్రతిపక్షాలపై తిట్ల దండకం అందుకుం దన్నారు. ఇప్పటికైనా ప్రజల సమస్యలను పరిష్కరిం చాలని లేదం టే ప్రజా ఉద్యమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో సమస్యలు పక్కదారి పడుతున్నా జగన్‌కు సోయి లేదన్నారు.
