NTV Telugu Site icon

CPI Narayana: సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకుంటున్నారు.. తెలంగాణ గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలి..!

Cpi Narayana

Cpi Narayana

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ గవర్నర్ వ్యవహార శైలి సరికాదు… ఆమె ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిలా పనిచేస్తున్నారు… ఆమెకు సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు.. అంతే కాదు.. తెలంగాణ గవర్నర్ ను వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్‌ చేశారు నారాయణ.. మరోవైపు.. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి విగ్రహాలను పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలని కోరారు.. దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలు కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని సూచించారు.. ఇక, కేంద్రమంత్రి మండలిలో నేరస్తులు ఉన్నారు. వారిని వదిలి జార్ఖండ్ సీఎం సోరేన్ ను సీఎం పదవి నుంచి తప్పించాలని చూశారంటూ ఫైర్‌ అయ్యారు. దేశాన్ని దోచుకుంటున్న అదానీ జోలికి ఎందుకు వెళ్లరు… అదానీ ఒకప్పుడు స్మగ్లర్… కానీ, తమను వ్యతిరేకిస్తున్నందునే ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు..

Read Also: Bandi Sanjay: గవర్నర్ పై బీజేపీ ముద్రవేసి అవమానిస్తున్నారు.. సంచలన ట్వీట్..

ఇక, బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు, నేతలు ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు.. అయితే, బీజేపీని నిలదీయడానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భయపడుతున్నారని విమర్శించారు. మరోసారి బిగ్‌బాస్‌పై ఫైర్‌ అయిన ఆయన.. బిగ్ బాస్ ఓ బ్రోతల్ కొంప… అక్కడ ఉండే పురుషులను కలిపి ఈ మాట అంటున్నాను అన్నారు.. కానీ, నేను మహిళలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కాగా, తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్ల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా.. గురువారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. పాలన బాగోలేదని.. అందకే ప్రజలు నా వద్దకు వస్తున్నారన్న ఆమె.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వానంగా ఉంది.. ధర్మాసుపత్రులు దయనీయంగా ఉన్నాయి.. మౌలిక వసతుల్లేకే కేంద్రం వైద్యకళాశాలలు ఇవ్వడం లేదు అని విమర్శించారు. అంతేకాదు.. ప్రభుత్వం తనకు కనీస గౌరం కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Show comments