NTV Telugu Site icon

వైర‌ల్‌: పిత‌క్కుండానే పాలిచ్చేస్తోంది…

క‌లియుగంలో ఎక్క‌డ ఎలాంటి వింత‌లు జరుగుతాయో తెలియ‌డంలేదు.  బ్ర‌హ్మంగారు చెప్పిన‌ట్టుగా అన్ని వింత వింత‌లు జ‌రుగుతున్నాయి.  మ‌నుషులు పాల కోసం ఆవుల‌ను పెంచుతుంటారు.  కొన్ని ఆవులు ఎంత పితికినా పాలు ఇవ్వవు.  కొన్ని వ‌ద్ద‌న్నా పాలు ఇచ్చేస్తుంటాయి.  అయితే, ఈ ఆవు మాత్రం అన్నింటికంటే స్పెష‌ల్‌.  ఈ ఆవు పొదుగును పిత‌క్క‌పోయినా పాలు ఇచ్చేస్తుంది.  ఈ విష‌యాన్ని ఆ ఆవు య‌జ‌మాని వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి పేర్కొన్నాడు.  చిత్తూరు జిల్లాలోని వ‌డ‌మాల మండ‌లంలోని నెన్నూరు వెంక‌ట‌రెడ్డి కండ్రిగ గ్రామంలోని వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి రెండున్న‌రేళ్ల ఆవు ఉన్న‌ది.  ఆ ఆవు ఇంకా ఏత‌కు రాలేదు.  అయిన‌ప్ప‌టికీ పాలు ఇస్తుంద‌ట‌.  పిత‌క్కుండానే పాలు ఇస్తున్న‌ది.  మార్చినెల నుంచి ప్ర‌తి నాలుగురోజుల‌కు ఒకసారి పిత‌క్కుండానే ఆవు పాలిస్తోంద‌ని య‌జ‌మాని చెబుతున్నాడు.  ఈ విష‌యం వారి ద్వారా వీరి ద్వారా ఆ జిల్లా మొత్తం వ్యాపించింది.  పిత‌క్కుండానే పాలిచ్చే ఆవును చూసేందుకు ప్ర‌జులు నెన్నూరు వెంక‌ట‌రెడ్డి కండ్రిగ‌కు క్యూ క‌డుతున్నారు.  

Read: బంగ్లాలోనూ…పాక్ ఘ‌ట‌న‌…హిందూ ఆల‌యంపై దాడి…