NTV Telugu Site icon

Plastic Covers: హృదయం ద్రవించే ఘటన.. ఆవు, దూడను పొట్టన పెట్టుకున్న ప్లాస్టిక్ భూతం

Cow And Calf Death

Cow And Calf Death

Cow and Calf Death in nandyal: ప్లాస్టిక్ వాడకం మనుషులకు మాత్రమే కాదు ఇతర జంతువులు, జీవ రాశులకు కూడా పెను ప్రమాదంగా మారుతుంది. ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నా చాలా మందిలో ఈ విషయం మీద ఇంకా అవగాహన రావడం లేదు. బయటకు వెళ్లేటప్పుడు గుడ్డతో కుట్టిన చేతి సంచులు తీసుకు వెళ్ళాలి, ఆ సంచులు చాలా రోజుల పాటు పారేయకుండా వాడాలి లాంటి సూచనలు ఎన్ని చేస్తున్నా వారు పెడ చెవిన పెడుతున్నారు.

Also Read: Adipurush Free tickets: ప్రకటనలేనా, చేతల్లో సాధ్యమయ్యే పనేనా?

తాజాగా ప్లాస్టిక్ పెనుభూతం ఒక ఆవును, దాని కడుపున పుట్టాల్సిన దూడను బలిగొన్న ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల టౌన్ లో ఆవును, దూడను ప్లాస్టిక్ భూతం కబళించింది. నంద్యాల పట్టణంలో ఒక ఆవు 8 నెలల గర్భంతో ఉంది, అయితే అది రోడ్లమీద తిరిగే ఆవు కావడంతో ఆహారం కోసం రోడ్డు మీద ఉన్న చెత్తాచెదారాన్ని తింటూ వచ్చింది. అలా మొత్తం క్యారీ బ్యాగులతో దాని కడుపు నిండి పోవడంతో పాటు ప్రసవానికి ఇబ్బంది కావడంతో ఆ నొప్పి భరించలేక రోడ్డు మీద నరకయాతన అనుభవించింది.

Also Read: Bhola Shankar: తెలుగులో పోటీ లేదు అయినా ‘భోళా శంకర్’కి పెద్ద పరీక్షే?

ఈ విషయాన్ని గమనించిన కొందరు జంతు ప్రేమికులు దాన్ని సొంత ఖర్చులతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే సిజేరియన్ చేసి దూడను బయటకు తీశారు అక్కడి వైద్యులు. అలాగే దూడతో పాటుగా ఆవు కడుపులో నుంచి 60 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు, క్యారీ బ్యాగులు బయటపడ్డాయి. అయితే ఎంతో కష్టపడి సిజేరియన్ చేసినా వైద్యులు, అటు ఆవును కానీ దూడను కానీ వైద్యులు కాపాడలేకపోయారు. గంటల వ్యవధిలో అవు,దూడ మృతి చెందగా తల్లడిల్లిన జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి పర్యంతం అయ్యారు.