NTV Telugu Site icon

రోజురోజుకు తగ్గిపోతున్న తిరుమల శ్రీవారి దర్శనాలు…

తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాల పై లాక్ డౌన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. గణనీయంగా తగ్గుముఖం పడుతుంది భక్తులు సంఖ్య. గతంలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు లక్షా ఐదు వేల మంది భక్తులు. కానీ ప్రస్తుతం భక్తులు సంఖ్య 4 వేలు కూడా దాటడం లేదు. ఈరోజు రోజున స్వామివారిని 3,228 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 988 మంది భక్తులు సమరించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.23 లక్షలు గా ఉంది. అయితే ఈ సంఖ్య ఇంకా తగ్గే సూచనలు ఉన్నాయి.