NTV Telugu Site icon

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

Shankar Rao

Shankar Rao

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలేది లేదు అనే తరహాలో.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అందరినీ టచ్ చేస్తూనే ఉంది… ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సోకిన వైరస్‌.. కొంత మంది ప్రాణాలు కూడా తీసింది.. తాజాగా.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనాబారనపడ్డారు.. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారి లక్షణాలతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు ఎమ్మెల్యే శంకర్‌రావు.. దీంతో.. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. స్వల్ప లక్షణాలే ఉండడంతో.. ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు ఎమ్మెల్యే శంకరరావు. తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని.. నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.