ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా అప్పుడప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.. ఇక, ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో కరోనా మహమ్మారి కలకలం రేపింది.. తాజాగా, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ కుటుంబం కరోనా బారినపడింది… మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ , ఆయన సతీమణి , కుమార్తె టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ సమన్వయకర్త గౌతు శిరీషకు కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. ప్రస్తుతం వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శివాజీ , ఆయన సతీమణికి చికిత్స పొందుతున్నారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు గౌతు శిరీష.. గడచిన రెండు మూడురోజుల్లో తమను కలిసిన వారు దయచేసి తమ ఆరోగ్యాన్ని గమనించుకోవాలని, కరోనా థర్డ్ వేవ్ నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు గౌతు శిరీష.
ఏపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్..
