NTV Telugu Site icon

కళతప్పిన అక్షయ తృతీయ 

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌టంతో దాదాపుగా 15 రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.  ప్ర‌తి ఏడాది అక్ష‌య తృతీయ రోజున గోల్డ్ షాపులు వినియోగ‌దారుల‌తో క‌ళ‌క‌ళ‌లాడేవి.  కానీ, ఈ ఏడాది గోల్డ్ షాపులు క‌రోనా కార‌ణంగా వెల‌వెల‌బోతున్నాయి.  తెలంగాణ‌లో ఉద‌యం ప‌ది గంట‌ల వ‌ర‌కే షాపుల‌కు అనుమ‌తి ఉండ‌టం, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కే షాపులు తెరిచి ఉండ‌టంతో వినియోగ దారులు పెద్ద‌గా కొనుగోలు చేసేందుకు ఫాపుల‌కు రావ‌డంలేద‌ని గోల్డ్ షాపుల య‌జ‌మానులు చెబుతున్నారు.  గ‌తేడాది పూర్తిస్థాయి లాక్‌డౌన్ కార‌ణంగా అమ్మాకాలు జ‌ర‌గ‌లేదు.  ఈ ఏడాది క‌రోనా ప్ర‌భావంతో అక్ష‌య తృతీయ సండ‌ది క‌నిపించ‌డం లేద‌ని బంగారం వ్యాపారులు చెబుతున్నారు.  కొనుగోలు దార్ల‌లో ఎక్కువ మంది వివాహల కోస‌మే కొనుగోలు చేస్తున్న‌ట్టు వ్యాపారులు చెబుతున్నారు.