NTV Telugu Site icon

Minister Usha Sri Charan: మంత్రి ఉషశ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

Ushasricharan1

Ushasricharan1

ఏపీ మంత్రి ఉష శ్రీ చరణ్ కి షాకిచ్చింది కోర్టు. మంత్రి ఉషశ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లఘించినందుకు 2017 ఫిబ్రవరి 27 న బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారంటూ అప్పటి తహసీల్థారు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు రావాల్సిన మంత్రి ఉష శ్రీ చరణ్ బుధవారం గైర్హాజరు కావడంతో మంత్రి తో పాటు ఏడుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

Read Also: Cold Wave: రాష్ట్రాల్లో పెరిగిన చలి.. కురుస్తున్న పొగమంచు

మంత్రి అయ్యాక ఆమె, గన్ మెన్లు తిరుమలలో హల్ చల్ చేశారు. ఆగస్ట్ 15న ఒకవైపు భక్తుల రద్దీ కొనసాగుతుంటే.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినా ఆమె మాత్రం అనుచరులతో తిరుమల వచ్చారు. పదిమంది సుప్రభాతం టికెట్టు పొందగా, అనుచరులు వీఐపీ దర్శనం పొందారు. ఇదేంటని అడిగితే ఆమె గన్ మెన్లు దౌర్జన్యం చేశారు. ఈ ఏడాది జూలై 6న కళ్యాణదుర్గంలో 200 ఎకరాల చెరువును మంత్రి ఉషశ్రీ చరణ్ కబ్జా చేస్తున్నారంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

100 ఎకరాల చెరువును పూడ్చి, ప్లాట్లుగా మార్చి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఉమమహేశ్వరరావు తన పిటిషన్లో తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారాయన. దీనిని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. కళ్యాణదుర్గం లోని సర్వే నెంబర్ 329లో వంద ఎకరాల సుబేదార్ భూమిని కబ్జా చేశారని ఆ పిటిషన్లో తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్, ఆర్టీవో లను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. రెండు వారాల్లో దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాజా జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also: Petrol Fraud: చిప్‌తో పెట్రోల్ నొక్కేస్తున్నారు.. బంకుల్లో వెలుగుచూసిన భారీ మోసం

Show comments