కాటన్ బ్యారేజీపై జనసేన శ్రమ దానానికి పర్మిషన్ రాలేదు. పవన్ శ్రమదాన కార్యక్రమంపై తేల్చి చెప్పేసారు ఇరిగేషన్ ఎస్ఈ. కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్ అండ్ బి పరిధిలోకి రాదని స్పష్టం చేసారు. మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని ప్రకటించారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందన్నారు అధికారులు. ఇదిలా ఉంటె బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతాం అంటునారు జనసేన శ్రేణులు. తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలలో పవన్ శ్రమదానం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ ఏపీలో శ్రమదానా కార్యక్రమం చేపట్టినా విషయం తెలిసిందే.
కాటన్ బ్యారేజీపై జనసేన శ్రమ దానానికి నో పర్మిషన్..
