NTV Telugu Site icon

ఏపీ పాఠశాలల్లో కరోనా కలకలం…

corona

ఏపీ శ్రీకాకుళం జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఈ నెల 16 నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్య సంస్థలు ప్రారంభైన విషయం తెలిసిందే. కానీ గడచిన పది రోజుల్లో ముగ్గురు టీచర్లు, నలుగురు విద్యార్ధులకు పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి లక్ష్మీనగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో నలుగురు 10వ తరగతి విద్యార్ధులకు కరోనా వచ్చింది. వారం రోజుల క్రితం అదే హైస్కూల్లో ఓ టీచర్ కు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే విద్యార్ధులకు కోవిడ్ నిర్ధారణ కావడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. అయితే నేడు 36 మంది విద్యార్ధులకు కోవిడ్ టెస్టులు చేయించారు అధికారులు. అయితే కరోనా కేసులు నమోదవుతుండటంతో విద్యార్ధులు, టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు అంధులకు గురవుతున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మొత్తం 13 విద్యార్ధులు, 4 టీచర్లు కోవిడ్ బారిన పడ్డారు.