ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 10,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా శనివారంతో పోలిస్తే.. ఈ రోజు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 1,263 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మరణాల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. గడిచిన 24 గంటలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల 12 మంది మరణించారు. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 9,692 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలోప్రస్తుతం 1,16,031 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 39,296 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఏపీలో కొత్తగా 10,310 కరోనా కేసులు
