Site icon NTV Telugu

దసరా ఉత్సవాలకు కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం…

విజయవాడ దసరా ఉత్సవాలకు కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ద్రుష్ట్యా ఈ ఏడాది 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది అని తెలిపింది. ఇక మూలానక్షత్రం రోజున కేవలం 70 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి 15 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. దాంతో అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది. దసరాలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్ లైన్ స్లాట్ తప్పనిసరి అని… ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఉండనున్నట్లు స్పష్టం చేసింది. దాంతో కొండ కింద ఆన్ లైన్ కౌంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. 7వ తేదీన శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు దుర్గమ్మ. 7 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుంది. దసరాలో మాలధారణ గావించిన భక్తులకు అనుమతినివ్వాలో లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది కో ఆర్డినేషన్ కమిటీ.

Exit mobile version