Site icon NTV Telugu

పీఠాధిపతి పదవి కోసం వారసుల మధ్య కొనసాగుతున్న వివాదం…

పీఠాధిపతి పదవి కోసం వారసుల మధ్య వివాదం కొనసాగుతుంది. వారసత్వంగా తమకే పదవి ఇవ్వాలంటున్నారు మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి. కాదు తమకే ఇవ్వాలని వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వీలునామా కూడా రాశారని రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ ఆరోపణ చేస్తున్నారు. అయితే ఆ వీలునామా ఫోర్జరీ అంటున్నారు మొదటి భార్య కుమారుడు. తన మొదటి తల్లికి కిడ్నీ దానం చేశానని అప్పట్లో తనకూ వాగ్దానం చేశారని మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రయ్య వెల్లడించారు. అయితే వీలునామా ప్రకారమా లేక సాంప్రదాయం ప్రకారం పీఠాధిపతి ఇవ్వాలా అనేది చర్చ సాగుతుంది. ఇక మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రికే మద్దతు పలుకుతున్నారు కందిమళ్లాయపల్లె గ్రామస్థులు. పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికే మఠాధిపతి పదవి ఇవ్వాలంటూ నేడు నిరసన చేపట్టనున్నారు కందిమళ్లాయపల్లె గ్రామస్థులు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Exit mobile version