Site icon NTV Telugu

ఏపీలో కాంగ్రెస్‌ బలోపేతంపై దృష్టిసారించిన అధిష్టానం

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపైతంపై దృష్టిసారించిన ఏఐసీసీ.. ఏపీ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నెల 11న రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు ఏపీ కాంగ్రెస్‌ నేతలు. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నారు. విడివిడిగా సీనియర్ నేతలతో రాహుల్ మాట్లాడనున్నారు. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో కూరుకుపోయింది. పార్టీని నడిపించే నాథుడులేక బలహీనపడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత బలహీనమైన కాంగ్రెస్‌ ఇంతవరకూ కోలకోలేదు.

మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ముందుకు ఎలా తీసుకెళ్లాలి? ఎవరికి పగ్గాలు అప్పగిస్తే పార్టీ గాడిలో పడుతుందనే అంశంపై చర్చించనున్నారు నేతలు. ఇప్పటికే అధిష్టానం నుంచి నేతలకు పిలుపొచ్చింది. రాష్ట్ర నేతల అభిప్రాయాలను, ఆలోచనలను తెలుసుకోనున్నారు. ఈ సమావేశం తర్వాత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అధిష్టానం పిలుపుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చింతా మోహన్, పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావులు ఢిల్లీకి వెళ్లనున్నారు. మొత్తానికి ఏపీలో పార్టీ బలోపేతంపై మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది కాంగ్రెస్‌. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి.

Exit mobile version