కరోనాతో మృతిచెందిన వారి పిల్లలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఇదివరకే తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనాతో అనాధలుగా మారిన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే బీమా నిబంధనల్లో సవరణ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు రూ. 10 లక్షల పరిహారం ఇచ్చే నిబంధనల్లో సవరణ చేశారు. ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలన్న నిబంధనను తొలగించారు. నిబంధన తొలగింపుతో అదనంగా మరికొంత మంది పిల్లలకు ప్రయోజనం దక్కనుంది. ఈమేరకు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ కమిషనర్ కు.. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ బీమా ఉన్న.. లేకున్నా రూ. 10 లక్షల పరిహారం
