NTV Telugu Site icon

ఏపీలో కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ల తేదీలు విడుదల

Adimulapu Suresh

Adimulapu Suresh

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ల తేదీలను విడుదల చేశారు.. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను ఇవాళ విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్‌లను నియమించారు.. ఈఏపీసెట్‌ను కాకినాడ జేఎన్టీయూ ఆగస్టు 19-25 తేదీల్లో నిర్వహించనుండగా.. ప్రొ. రామలింగరాజు ఛైర్మన్‌గా.. ప్రొ. రవీంద్ర కన్వీనర్‌ ఉంటారు.. ఈసెట్‌ను సెప్టెంబర్‌ 19న అనంతపురం జేఎన్టీయూ నిర్వహించనుండగా.. ప్రొఫెసర్‌ జి. రంగనాథం ఛైర్మన్‌గా, శశిధర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.. ఐసెట్‌ను ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం.. సెప్టెంబర్‌ 17-18 తేదీల్లో నిర్వహించనుంది.. ప్రొఫెసర్‌ పివిజిడి ప్రసాదరెడ్డి ఛైర్మన్‌గా.. ప్రొఫెసర్‌ శశిభూషణ్ రావు, కన్వీనర్‌గా ఉండనున్నారు.. ఇక, పీజీఈసెట్‌ను సెప్టెంబర్‌ 27 – 30 తేదీల్లో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తే.. ప్రొఫెసర్‌ కె రాజారెడ్డి, ఛైర్మన్‌గా.. ఆర్. సత్యనారాయణ.. కన్వీనర్‌గా పనిచేయనున్నారు.. మరోవైపు లాసెట్‌ను సెప్టెంబర్‌ 22న నిర్వహించనుంది శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, తిరుపతి.. దీనికి జమున ఛైర్మన్‌గా.. చంద్రకళ కన్వీనర్‌గా ఉంటారు.. ఎడ్‌సెట్‌ను సెప్టెంబర్‌ 21న ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం నిర్వహిస్తే.. ప్రొ. ప్రసాదరెడ్డి, చైర్మన్‌గా.. ప్రొ.వెంకటేశ్వరరావు కన్వీనర్‌గా పనిచేయనున్నారు.