NTV Telugu Site icon

సాధారణ కూలి ఇంటికి లక్షల్లో కరెంట్ బిల్‌… అదేంటని అడిగితే…!!

ఒక చిన్న ఇల్లు, మూడు బ‌ల్బులు, ఒక ఫ్యాన్‌, ఒక టీవి… ఇలాంటి ఇంటికి నెల‌కు క‌రెంట్ బిల్లు ఎంత వ‌స్తుంది.  మామూలుగా అయితే రూ.200 వ‌ర‌కు వ‌స్తుంది.  అయితే, అలాంటి ఇంటికి ఏకంగా ల‌క్ష‌ల్లో క‌రెంట్ బిల్లు వ‌చ్చింది.  ఆ బిల్లును చూసిన ఇంటి య‌జ‌మానికి గుండెనొప్పి వ‌చ్చినంత ప‌నైంది.  వెంట‌నే విద్యుత్ శాఖాధికారుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి బిల్లు చూపించి ఇదేంట‌ని అడిగితే… క‌ట్టాల్సిందే అన్నార‌ట‌.  కావాలంటే కొంత డిస్కౌంట్ ఇస్తామ‌ని చెప్పార‌ట‌.  ఈ సంఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలోని ఉర‌వ‌కొండ మండ‌లం పాల్తూరు గ్రామంలో జ‌రిగింది.  ఈ గ్రామానికి చెందిన ప‌ర్వ‌తప్ప ఇంటికి కరెంట్ బిల్లు ఏకంగా రూ.1,48,371 వ‌చ్చింది.  వెంట‌నే అధికారుల‌ను సంప్ర‌దించాడు.  అధికారులు ఆ బిల్లును రూ.56,399కి త‌గ్గించి క‌ట్టాల‌ని చెప్పారు.  తాను సాధార‌ణ కూలిపని చేసుకుంటూ జీవ‌నం సాగించే వ్య‌క్తిని అని అంత డ‌బ్బు క‌ట్టాలంటే క‌ష్ట‌మ‌ని చెప్పాడు.  మీట‌ర్ లో త‌ప్పులు ఉన్నాయోమో స‌రిచేయాల‌ని కోరారు.  

Read: రూ.30 కోట్ల హెలీకాప్టర్… రూ.26 కోట్లు డిస్కౌంట్‌… ఎవరూ కొన‌ట్లేద‌ట‌…!!!