Site icon NTV Telugu

YS Jagan: రాబోతున్నది పరీక్షా సమయం.. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు..!

వైసీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వార్నింగ్‌ ఇచ్చారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్.. ఎమ్మెల్యేలుగా ఉన్నవారి పనితీరును కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామన్న ఆయన.. రాబోతున్నది పరీక్షా సమయం.. 2 సంవత్సరాల్లో ఈ పరీక్షా సమయం రాబోతోంది.. ప్రజలకు చేసిన మంచిని తీసుకుని వెళ్లలేకపోతే అది తప్పే అవుతుందన్నారు.. ఈవిషయాన్ని ఎవరు కూడా తేలిగ్గా తీసుకోకూడదన్న ఆయన.. ఎవరు పనితీరు చూపించకపోయినా ఉపేక్షించేది లేదని ష్పష్టం చేశారు.. సర్వేల్లో పేర్లు రాకపోతే కచ్చితంగా మార్పులు వస్తాయన్న ఆయన.. అలాంటి అవకాశం ఇవ్వకూడదని కోరుతున్నా.. ఇప్పటివరకూ ఎలా ఉన్నా? ఇకపై ముందుకు కదలాలని ఆదేశాలు జారీ చేశారు..

Read Also: AP: వైసీఎల్పీ భేటీ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఇక, ఏప్రిల్‌ 10వ తేదీ కల్లా గ్రామ స్థాయిలో ఉపాధిహామీ సహా అన్ని బిల్లులనూ చెల్లిస్తామని తెలిపారు సీఎం జగన్.. మీరు గ్రామాలకు వెళ్లేసరికి బిల్లులు పెండింగులో ఉన్నాయనే ప్రశ్నరాదన్న ఆయన.. నగరాలు, పట్టణాల్లో కూడా బిల్లులు చెల్లిస్తామని.. ప్రతి ఎమ్మెల్యేకూ రూ.2 కోట్ల ప్రత్యేక నిధి ఉంటుందని.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి యాక్టివేట్‌ అవుతుందని స్పష్టం చేశారు.. ప్రతి గ్రామంలో మన ప్రతినిధులు ఉన్నారు.. సర్పంచులు, వార్డు మెంబర్లు, బూత్‌కమిటీలు.., ఎంపీటీసీలు, వీరంతా ఉన్నారు.. వీరందరికీ మంచి శిక్షణ అవసరం అన్నారు సీఎం.. తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన.. వారికి డైనమిక్‌గా ట్రైనింగ్‌ ఇవ్వాలని.. అప్పుడే టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వెంటనే కౌంటర్‌ ఇస్తారన్న ఆయన.. అది నేరుగా వారికి చేరుతుందని తెలిపారు. మనం చేస్తున్న యుద్ధం కేవలం చంద్రబాబుతోకాదు, మనం యుద్ధంచేస్తున్నది కొందరు ఉన్మాదులపై కూడా అంటూ.. కొన్ని పత్రికలు, టీవీ చానెళ్ల పేర్లను ప్రస్తావించారు సీఎం జగన్.. ఒక అబద్ధాన్ని నిజంచేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తారని.. గోబెల్స్‌ ప్రచారంతో బుల్డోజ్‌ చేస్తారని.. దీనిని కౌంటర్‌ చేయడానికి ఇంకా అలర్ట్‌గా ఉండాలని తెలిపారు. ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తలను యాక్టివ్‌ చేయాలి.. నిజాలను, వాస్తవాలను వారికి చేరవేయాలన్న ఆయన.. తప్పుడు ప్రచారాలను కౌంటర్‌ చేసే ఆయుధాలను కార్యకర్తల చేతిలో పెట్టాలన్నారు. ఇక, రాబోయే రోజుల్లో మరింతగా బురదజల్లే కార్యక్రమాలను చేపడతారు.. నిప్పు లేకుండానే పొగ తీసుకు వస్తారని.. ఏమీ లేకపోయినా.. ఏదో జరగుతుందనే భ్రమ కల్పిస్తారని.. అసత్య ప్రచారాలతో, గోబెల్స్‌ ప్రచారాలతో మనం యుద్ధంచేయాల్సి వస్తోందని అందరినీ అలెర్ట్‌ చేశారు సీఎం వైఎస్‌ జగన్.

Exit mobile version