CM YS Jagan Nidadavolu Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. నిత్యం బిజీగా గడిపేస్తున్నారు.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.. ఇక, ఇవాళ సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలులో పర్యటించనున్నారు.. నిడుదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు ముఖ్యమంత్రి జగన్.. నిడుదవోలు పర్యటన కోసం ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం.. ఉదయం 10.40 గంటలకు నిడుదవోలు చేరుకోనున్న ఆయన.. గాంధీనగర్‌లో సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్స్‌లో జరగనున్న నిడుదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుఅవుతారు.. వధూవరులను ఆశీర్వదిస్తారు.. ఆ తర్వాత ఉదయం 11.45 గంటలకు నిడుదవోలు నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం 12.25 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, సీఎం పర్యటన దృష్ట్యా.. ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశారు నిడుదవోలు పోలీసులు..
Read Also: Amit Shah: తెలంగాణపైనే నా ఫోకస్.. కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలి